Share News

ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:11 PM

మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

ఈదురుగాలుల బీభత్సం
సాలూరులో నేలవాలిన మొక్కజొన్న

- ధ్వంసమైన అరటి, మొక్కజొన్న

- లబోదిబోమంటున్న రైతులు

సాలూరు రూరల్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మామిడిపల్లి, కందులపథం, అన్నంరాజువలస, మరిపిల్లి తదితర గ్రామాల్లో 62 ఎకరాల్లో అరటి మొక్కలు నేలకూలాయి. అదే విధంగా మామిడిపల్లి, మరిపిల్లి, కందులపథం, కురుకూటి, కొత్తవలస, ఖరాసవలస తదితర గ్రామాల్లో 60 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట ధ్వంసంమైంది. అరటి పంటకు దాదాపు రూ.12 లక్షల నష్టం వాటిల్లింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాలూరు ఏవో కె.శిరీష, హెచ్‌వో ప్రత్యూష మంగళవారం ఆయా గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేశారు. నష్టాల వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏవొ శిరీష తెలిపారు.

Updated Date - Feb 24 , 2026 | 11:11 PM