టెండర్లను రద్దు చేయాలి
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:07 AM
ఏకపక్షంగా పిలిచిన ఎలక్ర్టికల్ బస్సుల టెండర్లకు రద్దు చేయాలని ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు బీకే మూర్తి, ఐ.రమణ, డీవీ రామ్, టీఎస్.రావు కోరారు. పాలకొండలోని ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ 1450 ఎలక్ర్టికల్ బస్సులను ఏకపక్షంగా టెండర్లను పిలవడం సమంజసం కాదన్నారు.
పాలకొండ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏకపక్షంగా పిలిచిన ఎలక్ర్టికల్ బస్సుల టెండర్లకు రద్దు చేయాలని ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు బీకే మూర్తి, ఐ.రమణ, డీవీ రామ్, టీఎస్.రావు కోరారు. పాలకొండలోని ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ 1450 ఎలక్ర్టికల్ బస్సులను ఏకపక్షంగా టెండర్లను పిలవడం సమంజసం కాదన్నారు.
పార్వతీపురంలో నిరసన
పార్వతీపురంటౌన్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం డిపోగేటు వద్ద ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండో దశలో 1,450 విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంయూ డిపో జేఏసీ నాయకులు కేబీ రాజు, ఈయూ నాయకులు డీఏ నాయుడు, ఎస్‌డబ్ల్యూ ఎఫ్ ఏఎస్ బాబులు మాట్లాడుతూ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభు త్వం కృషి చేయాలన్నారు. కార్మిక, ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క సహయాన్ని అందించాలన్నారు. జేఏసీ డిమాండ్లను వెంటనే ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం అంగీకరించాలని కోరారు.