Share News

టీడీపీని బలోపేతం చేయాలి

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:10 AM

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన సంక్షేమ విజయాలను ఇంటింటికి వివరించాలని మార్కె ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు పిలుపునిచ్చారు.

టీడీపీని బలోపేతం చేయాలి
మాట్లాడుతున్న బంగార్రాజు:

భోగాపురం, జూలై22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన సంక్షేమ విజయాలను ఇంటింటికి వివరించాలని మార్కె ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు పిలుపునిచ్చారు. టీడీపీని గ్రామాల్లో బలోపేతం చేయాలన్నారు. బుధవారం మండలంలోని పోలిపల్లి సమీపంలో డోర్‌ టుడోర్‌ పోగ్రాంపై నియోజకవర్గస్థాయి నా యకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షే మంపై ప్రతీ ఇంటికి వివరించాలన్నారు. ప్రజాసమస్యల పరి ష్కారం, సంక్షేమ పథ కాల అమల తీరు తదితర అంశాలు వివరించారు. పనిచేసిన కార్యకర్తలకు కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో కంది చంద్ర శేఖర్‌, పతివాడ అప్పల నారాయణ, ఆకిరి ప్రసాదు, మహంతి శంకర్రావు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:10 AM