ప్రతి పంచాయతీలో టీడీపీ జెండా ఎగరాలి
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:29 PM
ప్రతి పంచాయతీలోనూ టీడీపీ జెండా ఎగరాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పిలుపునిచ్చారు.
జామి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రతి పంచాయతీలోనూ టీడీపీ జెండా ఎగరాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పిలుపునిచ్చారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అన్న విషయానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలే నిదర్శనమని తెలిపారు. ఇక్కడ ప్రజలు అభ్యర్థులను కాకుండా ప్రభుత్వ పాలనకు ఓటు వేశారన్న విషయం మరిచిపోవద్దని చెప్పారు. బుధవారం రాత్రి అలమండలో మండలంలో గెలిచిన ఎంపీటీసీలతో స్థానిక నాయకుడు లగుడు రవికుమార్ నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ ఆధ్వర్యంలో అభినందించారు.