Share News

GATE results:గేట్‌ ఫలితాల్లో పాలకొండ యువకుడి సత్తా

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:22 AM

GATE results: గేట్‌-2026 ఆల్‌ ఇండియా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.

 GATE results:గేట్‌ ఫలితాల్లో పాలకొండ యువకుడి సత్తా
మనోహర్‌నాయుడు

- ఆల్‌ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు

పాలకొండ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): గేట్‌-2026 ఆల్‌ ఇండియా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో పాలకొండ పట్టణంలో నివాసం ఉంటున్న బొత్స మనోహర్‌నాయుడు అనే యువకుడు సత్తా చాటాడు. ఎలక్ర్టానిక్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఈసీ) విభాగంలో ఆల్‌ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు సాధించాడు. ఇందులో 69.33 మార్కులు రావడంతో గేట్‌ స్కోర్‌ 872 పొందాడు. అదే విధంగా ఇనిస్టిమెంట్స్‌ (ఐఎన్‌)లో ఆల్‌ ఇండియా స్థాయిలో 122వ ర్యాంకు సాధించాడు. ఇందులో మార్కులు 65.67 రాగా, గేట్స్‌ స్కోరు 705తో సత్తాచాటాడు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన మనోహర్‌.. కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌లో స్టాఫ్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పాలకొండ నవోదయ పాఠశాలలో, 8 నుంచి పదో తరగతి వరకు రాజాంలోని శ్రీచైతన్య స్కూల్‌లో, ఇంటర్‌ విశాఖపట్నంలోని శ్రీచైతన్య కళాశాలలో చదివాడు. బీటెక్‌ శ్రీసిటి చిత్తూరులో పూర్తి చేశాడు. ర మనోహర్‌నాయుడు తండ్రి వెంకటరమణ పాలకొండలోని వెంకంపేట జడ్పీ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా, తల్లి ప్రభావతి గృహిణి. గేట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మనోహర్‌కు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 20 , 2026 | 12:22 AM