The Survey System భూ సమస్యల పరిష్కారంలో సర్వే వ్యవస్థ కీలకం
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:37 PM
The Survey System is Key to Resolving Land Issues భూ సమస్యల పరిష్కారంలో సర్వే వ్యవస్థ ఎంతో కీలకమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో జాతీయ సర్వే దినోత్సవం నిర్వహించారు.
బెలగాం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారంలో సర్వే వ్యవస్థ ఎంతో కీలకమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో జాతీయ సర్వే దినోత్సవం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గ్రామ సర్వేయర్ వ్యవస్థ వల్ల విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రైతులకు అత్యంత చేరువగా ఉంటూ భూ సమస్యల పరిష్కారంలో వారిదే కీలక పాత్ర. గతంలో కేవలం 1200 మంది మండల సర్వేయర్లు ఉంటే నేడు 12వేల మంది వరకూ ఉన్నారు. ప్రతి గ్రామానికి వారి సేవలను అందుబాటులోకి తెచ్చాం. సర్వే యర్లత్లో పెండింగ్‌లో ఉన్న అర్జీలు త్వరగా పరిష్కారమవుతాయి. రాష్ట్ర స్థాయిలో చేపట్టే సర్వేలో మన్యం జిల్లా అగ్రగామిగా నిలవడం తథ్యం.’ అని తెలిపారు. అనంతరం పలువురికి ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి , సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్వో హేమలత, జిల్లా సర్వే, భూ రికార్డుల అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నీటి నిల్వలు పెంచాలి..
పార్వతీపురం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పక్కాగా జలధార-జలహారతి కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. భూగర్భ జల మట్టాలు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. శుక్రవారం ఏపీఎస్‌ఏసీ బృందం కలెక్టర్‌ను కలిసింది. నీటి వనరుల నిర్వహణ, జలాశయాలు, చెరువుల పరిరక్షణ కోసం ఈనెల 9 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు ఏపీఎస్‌ఏసీ జిల్లా సమన్వయ అధికారి కె.శ్రీనివాసు తెలిపారు. - గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పూర్తిస్థాయిలో పోషకాహారం అందించాలని, వారి ఆరోగ్యం, విద్యా విషయాలపై నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ తెలిపారు. తన చాంబర్‌లో పోషణ పక్వాడ పక్షోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 9 నుంచి 23 వరకు పక్షోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ప్రజ లకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని 84 హబ్ అంగన్‌వాడీ పాఠశాలలకు మెటీరియల్‌ను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
- వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన సర్వే, రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులను కలెక్టర్ అభినందించారు.