చక్కెర పరిశ్రమను కొనసాగించాలి
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:32 AM
సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర పరిశ్రమ వచ్చే క్రషింగ్ సీజన్ మూసివేస్తున్న నేపథ్యంలో ఈ ఫ్యాక్టరీ పది కాలాల పాటు ఈ ప్రాంతంలో ఉండేలా చూడాలని సంకిలి షుగర్స్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు.. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావును అభ్యర్థించారు.
రాజాం, చీపురుపల్లి ఎమ్మెల్యేలతో ‘సంకిలి’ పరిరక్షణ కమిటీ సమావేశం
రాజాం/ రేగిడి, ఆగస్టు 30(ఆంరఽధజ్యోతి): సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర పరిశ్రమ వచ్చే క్రషింగ్ సీజన్ మూసివేస్తున్న నేపథ్యంలో ఈ ఫ్యాక్టరీ పది కాలాల పాటు ఈ ప్రాంతంలో ఉండేలా చూడాలని సంకిలి షుగర్స్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు.. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావును అభ్యర్థించారు. ఈ మేర కు పోరాట కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేలను ఆదివా రం రాజాంలోని వారి క్యాంప్ కార్యాలయాల్లో కలిశారు. ఏపీ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి బుడితి అప్పల నా యుడు ఆధ్వర్యంలో పరిరక్షణ కమిటీ సభ్యులు కింజ రాపు సురేష్, చింత సంగంనాయుడు, కెంబూరు వెంక టేశ్వరరావు, సూర్యప్రకాశ్ భుక్త, గంగు కృష్ణారావు, కర్రి రమణ, కెంబూరు కోటేశ్వరరావు తదితరులు కలిశారు. చెక్కర పరిశ్రమ కొనసాగింపు, భవిష్యత్ కార్యాచరణ, యాజమాన్యానికి భరోసా ఉండేలా సాగు విస్తీర్ణం పెంపుపై ఎమ్మెల్యేలతో విడివిడిగా చర్చించారు. గతం వలే యాజమాన్యం చెరకు సాగుకు రాయితీలు ప్రక టించేలా చూడాలని, మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భరోసా ఉంటే రైతులు తప్పక చెరకు సాగు విస్తీర్ణం పెంచుతారని ఎమ్మెల్యేలకు వీరు నివేదించారు. ఉమ్మడి జిల్లాల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల గానుగ ఆడే చెరకు సాగు విస్తీర్ణానికి భరోసా ఉంటే సీఎం చంద్రబాబునాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఫ్యాక్టరీ ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఈలోగా ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసికట్టు గా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలు పోరాట కమిటీ ప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యేలను కలిసిన వారిలో రైతు ప్రతినిధులు తాడేల తవిటినాయుడు, ఎన్ని నారాయణరావు, టీడీపీ నాయకులు దూబ ధర్మా రావు, బుగత రాజు ఉన్నారు.