Share News

సివిల్స్‌లో కొర్లాం యువకుడి సత్తా

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:08 AM

యూని యన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (యూపీఎస్సీ) ఫలితాల్లో గంట్యాడ మండలం కొర్లాం గ్రామా నికి చెందిన పల్లి ప్రమోదవిష్ణు సత్తాచాటా డు.

 సివిల్స్‌లో కొర్లాం యువకుడి సత్తా
ప్రమోదవిష్ణు

- 640 ర్యాంకు సాధించిన ప్రమోద విష్ణు

గంట్యాడ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): యూని యన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (యూపీఎస్సీ) ఫలితాల్లో గంట్యాడ మండలం కొర్లాం గ్రామా నికి చెందిన పల్లి ప్రమోదవిష్ణు సత్తాచాటా డు. రెండో ప్రయత్నంలో 640 ర్యాంకు సాధిం చాడు. ప్రస్తుతం ఈయన కుటుంబీకులు విజయ నగరంలోని కామాక్షినగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రమోద విష్ణు తండ్రి శ్రీనివా సరావు ఇంగ్లీసు స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. తల్లి ఉపాధ్యాయురాలుగా పని చేస్తూ రెండు నెలల కిందట అనారో గ్యంతో మృతి చెందారు. ప్రమోద విష్ణు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విజయనగరంలోని సెయింట్‌ జోసఫ్‌ పాఠశాలలో, 6,7 తరగ తులు నారాయణ స్కూల్‌లో, 8 నుంచి 10 వరకూ కేకేఆర్‌ గౌతం స్కూల్‌లో చదివాడు. విజయవాడలో ఇంటర్మీడియట్‌, ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేశాడు. అనంతరం సివిల్స్‌కు చదివాడు. మొదటి ప్రయత్నంలో నిరాశ ఎదురైనా, రెండో ప్రయత్నంలో 640 ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకుతో ఐఆర్‌ఎస్‌ వస్తుందని విష్ణు తండ్రి శ్రీనివాసరావు వెల్లడించారు.

Updated Date - Mar 07 , 2026 | 12:08 AM