Share News

జిల్లాలో స్త్రీనిధి లక్ష్యం రూ.598 కోట్లు

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:43 AM

జిల్లాలో స్త్రీనిధి లక్ష్యం రూ.598 కోట్లు అని స్త్రీనిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరిప్రసాద్‌ తెలిపారు.

జిల్లాలో స్త్రీనిధి లక్ష్యం రూ.598 కోట్లు

  • ఎండీ హరిప్రసాద్‌

మెంటాడ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్త్రీనిధి లక్ష్యం రూ.598 కోట్లు అని స్త్రీనిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరిప్రసాద్‌ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక వెలుగు కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా సంబంధిత డాక్యుమెం ట్లను పరిశీలించారు. మండలానికి నిర్దేశిత లక్ష్యాలపై చర్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకూ రూ.1.80 కోట్లు రుణాలు అందజేశారని తెలిపారు. ప్రస్తుత రికవరీ 90 శాతం ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో స్త్రీనిధి లక్ష్యం రూ.598 కోట్లుకు గాను ఇప్పటివరకూ రూ.200 కోట్లు మంజూ రు చేశారని ఆయన వెల్లడించారు. ఆయనతోపాటుగా డీజీఎం కృష్ణంనాయుడు, ఏజీఎం సత్యనారాయణ, ఏపీ ఎం అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.

డెంకాడ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెలుగు కార్యాలయాన్ని స్త్రీనిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరిప్రసాద్‌ సోమవారం సందర్శిం చారు. ఈసందర్భంగా స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు అందిస్తున్న రుణాలకు సంబంధించిన డాక్యు మెంటేషన్‌, రుణ ధ్రువీకరణ ప్రక్రియ, లబ్ధిదారుల వివ రాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. రుణ ధ్రువీ కరణ కోసం వచ్చిన లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న రుణాల వినియోగం, రుణం పొందే విధానం, తిరిగి చెల్లింపులపై వివరాలను తెలుసుకున్నా రు. రుణాల మంజూరులో సరైన డాక్యుమెంటేషన్‌, పారదర్శకత, నిబంధనల పాటింపు అత్యంత ముఖ్యమ ని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ డీజీఎం కృష్ణంనాయుడు, ఏజీఎం సత్యనారాయణ, ఏపీఎం శ్రీనివాస్‌, మేనేజర్‌ అరుణ, సీసీ విశ్వేశ్వరరావు, సీసీ మంజుశ్రీ తదితరులు పాల్గొన్నారు.

శృంగవరపుకోట, ఆగస్టు 24(ఆంధ్రజ్యో తి): వెలుగు శాఖ ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు రాయితీతో కూడిన స్త్రీనిధి రుణాలు అందించాలని విజ యవాడ సెర్ప్‌ స్త్రీనిధి మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీబీడీ హరిప్రసాద్‌ సూచించారు. సోమవారం ఎస్‌.కోట వెలు గు కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న వీఏవోల సమావే శంలో పాల్గొని పలు విషయాలపై చర్చించారు. స్త్రీనిధి ఏజీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 12:43 AM