కథ అడ్డం తిరిగింది
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:44 AM
రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండడం, రెండు దశాబ్దాల తరువాత రాజాం మున్సిపా లిటీలో ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ దక్కడంతో చైర్మన్ పీఠంపై టీడీపీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
- రాజాం మున్సిపాలిటీ జనసేనకు కేటాయింపు
- టీడీపీలో కలవరం
రాజాం రూరల్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండడం, రెండు దశాబ్దాల తరువాత రాజాం మున్సిపా లిటీలో ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ దక్కడంతో చైర్మన్ పీఠంపై టీడీపీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈ పురపాలక సంఘాన్ని బీసీ మహిళకు రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో భంగపడ్డ టీడీపీ నేతలు తమ భార్యల్ని రంగంలోకి దింపి పాలన సాగిద్దామని కలలు కన్నారు. కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పొత్తులో భాగంగా రాజాం మున్సిపాలిటీని జనసేనకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి ప్రకటించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిపై గంపెడాశతో ఉన్న పార్టీశ్రేణులు కలవరపాటుకు గురయ్యాయి. అటు అధిష్టానాన్ని నిందించలేక,, ఇటు జనసేనకు పట్టం కట్టేందుకు ఇష్టంలేక తెలుగు తమ్ముళ్లు లోలోన మదనపడుతున్నారు.
జనసేనలో ఉత్సాహం..
రాజాం మున్సిపాలిటీని జనసేనకు కేటా యించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇన్నాళ్లకు తమకు తగిన గుర్తింపు దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, బీజేపీ శ్రేణుల అండదండలతో మున్సి పాలిటీలో విజయం సాధిస్తే ప్రజల్లోకి మరింత చురుకుగా వెళ్లేందుకు అవకాశాలుంటాయ న్న భావన వారిలో వ్యక్తమవు తోంది. చైర్పర్సన్ అభ్యర్థిగా జనసేన నియోజకవర్గ సమన్వ యకర్త పొగిరి సురేష్‌బాబు భార్య కృష్ణవేణి లేదా కుమార్తె దీపిక రంగంలోకి దిగే అవకా శాలు కనిపిస్తున్నాయి.