Share News

రాళ్లు తేలి.. బురదమయమై..

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:37 AM

రాళ్లుతేలి.. బురద బురదగా ఉన్న ఈ రోడ్డు 20 గ్రామాలను అనుసం ధానం చేస్తుంది. 1998లో కోటి రూపాయలతో పద్మాపురం జంక్షన్‌ నుంచి 8 కిలోమీటర్ల మేరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.

రాళ్లు తేలి.. బురదమయమై..
అధ్వానంగా మారిన కుంతాం రోడ్డు

  • 20 గ్రామాలకు వెళ్లే రోడ్డు అధ్వానం

పాచిపెంట రూరల్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాళ్లుతేలి.. బురద బురదగా ఉన్న ఈ రోడ్డు 20 గ్రామాలను అనుసం ధానం చేస్తుంది. 1998లో కోటి రూపాయలతో పద్మాపురం జంక్షన్‌ నుంచి 8 కిలోమీటర్ల మేరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అప్పట్లో ఈ రోడ్డును కొంతాం, కాగులగెడ్డ, చెరుకుగుడ్డి, మెట్టగుడ్డి, కుంతంబడేవలస, మూలపాడు, బంగారుగుడ్డి, బుచ్చింపాడు, కాట్రగుడ్డి, అడారపాడు తదితర 20 గిరిజన గ్రామాలకు రాకపోకలకు వీలుగా వేశారు. అయితే ఈ రోడ్డు ప్రస్తుతం అధ్వాన్నంగా తయా రైంది. రాళ్లు తేలి ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయి. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. గిరిజనులు నిత్యావసరాల కోసం మైదాన ప్రాంతానికి రావాలంటే వారి ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఇక అత్యవసరం అయితే అంతేసంగతులు. ఆ గ్రామాల్లో ఎవరికి ఏ జబ్బు చేసినా 108 వాహనం కూడా రాలేని పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరింత అధ్వాన్నంగా తయారైంది. పాలకులు, అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:37 AM