Share News

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:32 PM

ఎన్నికలు ప్రజాస్వా మ్యయుతంగా నిర్వహించలేని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా రాజీనా మా చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్‌చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి
విజయనగరం దాసన్నపేట: నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు:

విజయనగరం దాసన్నపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ప్రజాస్వా మ్యయుతంగా నిర్వహించలేని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా రాజీనా మా చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్‌చేశారు. ఈ మేరకు బుధవారం విజయనగరంలోని ఆర్టీసీకాంప్లెక్స్‌ వద్ద కూటమి అప్రజాస్వామిక చర్యలను ఖండి స్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్షనేతలు రెడ్డి శంకరరా వు, ఓమ్మి రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక కూటమి ప్రభుత్వం, పోలీసులు కలిపి ప్రతిపక్షాలను నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడం, రిగ్గింగుకు పాల్పడడం, లెక్కింపుల్లో అక్రమాలకు పాల్పడినా, కూటమి అప్రజాస్వామిక చర్యలను ప్రజలంతా ఖండించాలని తెలిపారు. కార్యక్రమంలో జగ న్మోహన్‌, సురేష్‌, రమణ, రంగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఫభోగాపురం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌, మండల పరిషత్‌ ఎన్ని కలు ఇటీవల ప్రజాసామ్యానికి విరుద్దంగా జరిగాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.సూర్యనారాయణ ఆరోపించారు.భోగాపురం ఎత్తు బ్రిడ్జి సెంటర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చోటుచేసుకొన్న అవాంచనీయ సంఘటనలను ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈకార్యక్రమంలో కె.అప్పారావు, చంద్రరావు, రాము పాల్గొన్నారు.

ఫనెల్లిమర్ల, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల మొయదా జంక్షన్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజీనామాచేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. ఈసందర్భంగా సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు ము య్యదా పాపారావు, కిల్లంపల్లి రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అధికార పార్టీకి రిమోట్‌ కంట్రోల్‌గా మారి ఎన్నికలను అపహాస్యం చేశారన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:32 PM