Share News

The spirit of sportsmanship should be cultivated క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:10 AM

The spirit of sportsmanship should be cultivated గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి సూచించారు.

The spirit of sportsmanship should be cultivated క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలి
క్రీడలను ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలి

కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

ఏపీఎస్‌పీ 5వ బెటాలియన్‌ 37వ క్రీడా పోటీలు ప్రారంభం

డెంకాడి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి సూచించారు. స్థానిక చింతలవలస ఏపీఎస్‌పీ 5వ బెటాలియన్‌లో 37వ క్రీడా పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్రీడల వల్ల సమిష్టితత్వం అలవడుతుందన్నారు. సమిష్టిగా కృషి చేసినప్పుడే అద్భుత విజయాలను సాధించగలమని చెప్పారు. నిరంతర సాధన ద్వారానే ఏ పనిలోనైనా, క్రీడల్లోనైనా ప్రావీణ్యాన్ని పొందగలమని స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ క్రీడా సాధన చేయాలని సూచించారు. బెటాలియన్‌ కమాండెంట్‌ వై.రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని అన్నారు. పోలీసులే కాకుండా వారి పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కలెక్టర్‌ ముందుగా కవాతును తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ సి.రాజారెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్లు జివి.ప్రభాకర్‌రావు, జి.లక్ష్మీనారాయణ, ఎస్‌.బాపూజీ, డివి.మరణమూర్తి, ఎం.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

------------------------

Updated Date - Jan 06 , 2026 | 12:10 AM