Share News

నిండు ప్రాణం బలితీసుకున్న అతివేగం

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:23 AM

అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

నిండు ప్రాణం బలితీసుకున్న అతివేగం

  • ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌

  • ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

జామి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తాండ్రంగి గ్రామంలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ వైవీ జనార్దన్‌ తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరపుకోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన కొట్టాన ఎర్నాయుడు(25) బుధవారం ఉదయం తన మిత్రుడు గోలగాన వెంకట్రావును గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురంలో దింపేందుకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నాడు. ఈక్ర మంలో తాండ్రంగి గ్రామం చేరుకోగానే ఎదురుగా అతివేగంగా వస్తున్న ట్రాక్టర్‌ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఇదే సమయంలో ఎర్నాయుడు రోడ్డుపై పడిపో యాడు. సరిగ్గా ట్రాక్టర్‌ టైర్‌ అతని తలపై నుంచి వెళ్లడంతో ఘటనా స్థలంలో మృతిచెందాడు. వెంకటరావు గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి ట్రాక్టర్‌ డ్రైవర్‌ మురళి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతుడు విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న బ్లింకిట్‌ స్టోర్స్‌లో పనిచేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. కొడుకు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలాన్ని చేరుకుని, విలపించిన తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి కొట్టాన వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్‌ఐ వైవీ జనార్దన్‌ తెలిపారు.

Updated Date - Apr 30 , 2026 | 12:24 AM