Share News

The Sound of Water జల సవ్వడి

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:34 AM

The Sound of Water అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు సీతంపేట ఏజెన్సీ, భామిని మండలంలోని జలపాతాలు జలసవ్వడులతో కనువిందు చేశాయి. దీంతో పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో సందడి చేశారు. సెలవుల నేపథ్యంలో సీతంపేట మండలం సున్నపుగెడ్డ, మెట్టుగూడ జలపాతాల వద్దకు ఆదివారం పెద్దఎత్తున సందర్శకులు తరలివచ్చారు.

The Sound of Water జల సవ్వడి
మెట్టుగూడ జలపాతం ఇలా..

సీతంపేట/భామిని, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు సీతంపేట ఏజెన్సీ, భామిని మండలంలోని జలపాతాలు జలసవ్వడులతో కనువిందు చేశాయి. దీంతో పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో సందడి చేశారు. సెలవుల నేపథ్యంలో సీతంపేట మండలం సున్నపుగెడ్డ, మెట్టుగూడ జలపాతాల వద్దకు ఆదివారం పెద్దఎత్తున సందర్శకులు తరలివచ్చారు. జలపాతాల వద్ద జాలువారుతున్న నీటి హొయలను ఆసక్తిగా తిలకించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్నానాలు ఆచరించారు. జలపాతాల వద్ద ఏర్పాటు చేసిన ఫొటోషూట్‌ పాయింట్ల వద్ద కూడా సెల్ఫీలు తీసుకుని ఉత్సాహంగా గడిపారు. ఆడలి వ్యూ పాయింట్‌, ఎన్‌టీఆర్‌ అడ్వంచర్‌పార్క్‌లో కూడా పర్యాటకుల రద్దీ నెలకొంది. ఇక భామిని మండలం నల్లరాయిగూడ సమీప జలపాతం వద్ద కూడా సందడి నెలకొంది. పర్యాటకులు బాలేరు సెంటర్‌ నుంచి నల్లరాయిగూడ మీదుగా మూడు కిలోమీటర్లు ప్రయాణించి జలపాతాన్ని సందర్శించి.. స్నానాలు చేసి సేదతీరారు.

Updated Date - Sep 14 , 2026 | 12:34 AM