Share News

The Sirimanu is being prepared సిద్ధమవుతున్న సిరిమాను

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:36 AM

The Sirimanu is being prepared పైడిమాంబ సిరిమానోత్సవం దగ్గర పడుతున్న నేపథ్యంలో సిరిమాను చెట్టును మానుగా మలిచే పనులు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. హుకుంపేటలోని ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి.

The Sirimanu is being prepared  సిద్ధమవుతున్న సిరిమాను

సిద్ధమవుతున్న సిరిమాను

హుకుంపేటలో వడ్రంగి నిపుణులతో పనులు

విజయనగరం కల్చరల్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్సవం దగ్గర పడుతున్న నేపథ్యంలో సిరిమాను చెట్టును మానుగా మలిచే పనులు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. హుకుంపేటలోని ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి. సిరిమాను, ఇరుసుమాను, పూజారి కూర్చొనే పీట కూడా వారే తయారు చేస్తారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లికి చెందిన కనిమెళ్ల రమణ, రణస్థలానికి చెందిన టేకు శంకరరావు, విజయనగరం మండలం సారికకు చెందిన నల్లపాటి వెంకటేశ్వరరావు, గరివిడి మండలం గెడ్డపువలసకు చెందిన చిట్టూరు గోవింద్‌ ఈ పనులు చేపట్టారు. నెల్లిమర్ల మండలం మీసాల లక్ష్ముంనాయుడు కూడా భాగస్వాములయ్యారు. వీరంతా పూర్వం నుంచి సిరిమాను మలిచే పనులు చేస్తున్నారు. జొన్నవలస నుంచి సిరిమాను, ఇరుసుమానులు చెట్లను హుకుంపేటకు తీసుకువచ్చాక సిరిమానుకు భక్తులు పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నారు. వడ్రంగి పనులు ప్రారంభం కావడంతో పూజలకు ఎవరినీ అనుమతించడం లేదు.

Updated Date - Oct 16 , 2026 | 12:36 AM