కనులపండువగా కనకదుర్గమ్మ తీర్థం
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:31 AM
కొటారుబిల్లి కనకదుర్గమ్మ తీర్థ మహో త్సవం కనులపండువగా సాగింది. శని వారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ తీర్థానికి భక్తులు పోటెత్తారు.
గంట్యాడ జనవరి 17(ఆంధ్రజ్యోతి): కొటారుబిల్లి కనకదుర్గమ్మ తీర్థ మహో త్సవం కనులపండువగా సాగింది. శని వారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ తీర్థానికి భక్తులు పోటెత్తారు. ప్రతిఏటా కనుమ పండగ మరుసటి రోజున అమ్మ వారి తీర్థం నిర్వహిస్తారు. ఉదయం నుంచే ఆలయానికి ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తాకిడి మొ దలైంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య తదితరులు అమ్మ వారిని దర్శించుకున్నారు. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, గంట్యాడ ఎస్‌ఐ సాయి కృష్ణ బందోబస్తు ఏర్పాటు చేశారు.