The shattered collectorate దద్దరిల్లిన కలెక్టరేట్
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:33 PM
The shattered collectorate తమకు కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, లేబర్ కోడ్‌ను రద్దుచేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ, ఆశా కార్యర్తలు, మున్సిపల్ గ్రీన్ అంబాసిడర్లు, మధ్యాహ్నా భోజన వంట కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.
దద్దరిల్లిన కలెక్టరేట్
నిరసనకు దిగిన అంగన్వాడీలు, ఆశావర్కర్లు, గ్రీన్ అంబాసిడర్లు
కలెక్టరేట్ లోకి ప్రవేశించేందుకు తీవ్రయత్నం
విజయనగరం, ఆగస్టు 10 (ఆంధజ్యోతి):
తమకు కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, లేబర్ కోడ్‌ను రద్దుచేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ, ఆశా కార్యర్తలు, మున్సిపల్ గ్రీన్ అంబాసిడర్లు, మధ్యాహ్నా భోజన వంట కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉదయం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. సుమారు 2 గంటలకు పైగా విశాఖ-రాయపూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. కలెక్టర్ బదులు డీఆర్వో సత్తిబాబు వినతిపత్రం స్వీకరించేందుకు రాగా ఆందోళనకారులు నిరాకరించి మరింత ఉధృతంగా నినాదాలు చేశారు. పోలీసులకు.. నిరసనకారులకు మధ్య పలుమార్లు తోపులాట జరిగింది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు కార్మికులు తీవ్ర ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పోలీసులు డీఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో నిరసనకారులను అదుపులోకి తీసుకొని పోలీసువాహనంలో తరలించారు. ఆందోళనపై సీఐటీయూ నాయకుడు టీవీ రమణ మాట్లాడుతూ సమస్య పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమని, పోలీసులతో కార్మిక హక్కులను కాలరాయడం మంచిది కాదన్నారు. సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు.