‘ఆర్యవైశ్యుల సేవలు అభినందనీయం’
ABN , Publish Date - May 05 , 2026 | 12:33 AM
ఆర్యవైశ్యుల సేవలు అభినందనీయమని రాష్ట్ర గిరిజన సక్షేమ శాఖ మంత్రి సంధ్యా రాణి అన్నారు.
సాలూరు, మే 4(ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యుల సేవలు అభినందనీయమని రాష్ట్ర గిరిజన సక్షేమ శాఖ మంత్రి సంధ్యా రాణి అన్నారు. సోమవారం పట్టణంలో ఆర్యవైశ్య సంఘం నిర్మించిన వాసవీ భవన్ కల్యాణ మండపాన్ని రాజ్యసభ మాజీ సభ్యుడు టి.జి.వెంకటేశ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భం గా సంధ్యారాణి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘం ఎప్పుడూ ముందుంటుందని ప్రశంసించారు. వాసవీ భవన్ స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ అభివృద్ధిలో ఆర్య వైశ్యుల పాత్ర ఎనలేనిదన్నారు. కార్యక్రమం లో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.