Secretariat System సచివాలయ వ్యవస్థ మరింత మెరుగుపడాలి
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:37 PM
The Secretariat System Must Be Further Strengthened సచివాలయ వ్యవస్థ మరింత మెరుగుపడాలని, సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కురుపాం సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. కొందరు సిబ్బంది ఆన్‌లైన్‌లో హాజరు వేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
కురుపాం, జనవరి30(ఆంధ్రజ్యోతి): సచివాలయ వ్యవస్థ మరింత మెరుగుపడాలని, సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కురుపాం సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. కొందరు సిబ్బంది ఆన్‌లైన్‌లో హాజరు వేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సచివాల సిబ్బంది ఆన్‌లైన్ హాజరు వేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే సహించబోమని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారులు ఇకపై నిరంతం సచివాలయాలను సందర్శిస్తారని, అటెండెన్స్ , ఆన్‌లైన్ లాగిన్ వివరాలను క్షణ్నంగా పరిశీలిస్తారని తెలిపారు. మనమిత్రపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, ఆ సేవలు మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. ప్రజలు నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు. ప్రతి సచివాలయం ఒక ఆదర్శ సేవా కేంద్రంగా మారాలని తెలిపారు.
ఆసుపత్రి పనులు వేగవంతం
కురుపాం ఆసుపత్రి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని, గడువు లోగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్వరగా సీహెచ్‌సీ అదనపు భవనాలు అందుబాటులోకి తేవాలన్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వైద్యుడు సునీల్‌కుమార్‌తో మాట్లాడి వైద్యసేవలు, ఇతరత్రా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న అదనపు భవన నిర్మాణాలను ఆయన పరి శీలించారు. క్షేత్ర స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని, రాజీ పడకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరిగితే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.