Share News

The school bus overturned స్కూల్‌ బస్సు బోల్తా

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:11 AM

The school bus overturned అలజంగి గ్రామ సమీపంలో జంక్షన్‌ వద్ద బొబ్బిలి- రాజాం వెళ్లే రహదారిలో బుధవారం సాయంత్రం ప్రయివేటు స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులకు గాయాలయ్యాయు.

The school bus overturned స్కూల్‌ బస్సు బోల్తా
అలజంగి గ్రామం వద్ద పొలాల్లో బోల్తా పడిన స్కూల్‌ బస్సు

స్కూల్‌ బస్సు బోల్తా

22 మంది విద్యార్థులకు గాయాలు

బొబ్బిలి రూరల్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి):

అలజంగి గ్రామ సమీపంలో జంక్షన్‌ వద్ద బొబ్బిలి- రాజాం వెళ్లే రహదారిలో బుధవారం సాయంత్రం ప్రయివేటు స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులకు గాయాలయ్యాయు. వీరంతా బొబ్బిలి పట్టణంలోని సెవెంత్‌ డే ప్రయివేటు పాఠశాలలో వివిధ తరగతులు చదువుతున్నారు. కాడాడ గ్రామం వద్ద ఉన్న సన్‌రైజ్‌ చిల్డ్రన్‌ హోమ్‌ (స్వచ్ఛంద సేవాసంస్థ) సంరక్షణలో ఉంటున్న ఈ విద్యార్థులంతా ప్రతిరోజులాగే బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం పాఠశాల పూర్తయిన అనంతరం 34 మంది విద్యార్థులు బస్సులో కారాడ సన్‌రైజ్‌ హోమ్‌కు బయలుదేరారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని డ్రైవర్‌ తప్పించబోయాడు. ఆ క్రమంలో బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి బోల్తా పడింది. ఆ వైపుగా వెళ్తున్న వారంతా వచ్చి సహకారం అందించారు. గాయపడిన 22 మందిని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్‌ రవికాంత్‌ ప్రాథమిక చికిత్స అందించారు. ఏడో తరగతి చదువుతున్న పిట్ల నానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్సను అందించి విజయనగరం జీజీహెచ్‌కు రిఫర్‌ చేసినట్లు రవికాంత్‌ తెలిపారు. ఆరు, ఏడు తరగతులకు చెందిన ఆర్‌.బాల కరుణ్‌, దార్గారావు, జయశంకర్‌, ప్రవీణ్‌, ప్రదీప్‌లకు కాళ్లు చేతులకు గాయాలు కాగా మరికొంతమందికి కనుబొమ్మల వద్ద స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 12 , 2026 | 12:11 AM