Share News

సైనికుల త్యాగాలు మరువలేనివి

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:32 AM

భారతదేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివని జిల్లా న్యాయసేవాధికా ర సంస్థ కార్యదర్శి డా.ఎ.కృష్ణప్రసాద్‌, పర్మినెంట్‌ లోక్‌అదాలత్‌ చైర్మన్‌ జి.దుర్గయ్యలు అన్నారు.

 సైనికుల త్యాగాలు మరువలేనివి

  • జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్‌

విజయనగరం దాసన్నపేట, జూలై 24(ఆంధ్రజ్యోతి): భారతదేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివని జిల్లా న్యాయసేవాధికా ర సంస్థ కార్యదర్శి డా.ఎ.కృష్ణప్రసాద్‌, పర్మినెంట్‌ లోక్‌అదాలత్‌ చైర్మన్‌ జి.దుర్గయ్యలు అన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని జిల్లా సైనిక వెల్ఫేర్‌ బోర్డులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతిఒక్కరూ వినియోగించు కోవాలన్నారు. వీర్‌ పరివార్‌ సహాయత పథకంపై మాజీ సైనికులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక అధికారి శివప్రసాద్‌రావు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:32 AM