Share News

అమరజీవి త్యాగాన్ని స్మరించుకోవాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:39 AM

అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగాన్ని భావితరాలు స్మరించుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

అమరజీవి త్యాగాన్ని స్మరించుకోవాలి

  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

  • ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

గజపతినగరం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగాన్ని భావితరాలు స్మరించుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడు తూ పొట్టిశ్రీరాములు కృషి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు ఒడిశా, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు భాషా రహిత రాష్ట్రాలుగా ఏర్పడ్డాయన్నారు. అమరావతిలో ఆయన చేపట్టిన 58 రోజుల నిరాహారదీక్షకు ప్రతీకగా ముఖ్యమంత్రి 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 12:39 AM