Share News

‘సమాజంలో మహిళల పాత్ర కీలకం’

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:47 PM

సమాజ అభివృద్ధి, కుటుంబ వ్యవస్థ బలోపేతంలో మహిళల పాత్ర కీలకమని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు.

‘సమాజంలో మహిళల పాత్ర కీలకం’
విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న ఎస్పీమాధవరెడ్డి

బెలగాం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): సమాజ అభివృద్ధి, కుటుంబ వ్యవస్థ బలోపేతంలో మహిళల పాత్ర కీలకమని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. ఆది వారం పార్వతీపురంలోని ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో జిల్లా పోలీష్‌ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా ఎస్పీ హాజరై మాట్లాడారు. మహిళ సాధికా రితతోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి మహిళా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళా పోలీస్‌ ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్య క్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి, డీఎస్పీ థామస్‌రెడ్డి, సీఐ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 11:47 PM