రోడ్లను పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:15 AM
రోడ్లను పూర్తి చేయాలని సీపీఎం నాయ కులు కోరారు. ఈ మేరకు శనివారం మండలంలోని పలు గిరిశిఖర గ్రామాలకు రెండు నెలల కిందట శంకుస్థాపనలు చేసిన పనులు చేయకుండా వదిలేయడం దారుణమని కూనేరు సంతలో సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ మండలకార్యదర్శి కొల్లి సాంబమూర్తి నిరసన తెలిపారు.
కొమరాడ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): రోడ్లను పూర్తి చేయాలని సీపీఎం నాయ కులు కోరారు. ఈ మేరకు శనివారం మండలంలోని పలు గిరిశిఖర గ్రామాలకు రెండు నెలల కిందట శంకుస్థాపనలు చేసిన పనులు చేయకుండా వదిలేయడం దారుణమని కూనేరు సంతలో సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ మండలకార్యదర్శి కొల్లి సాంబమూర్తి నిరసన తెలిపారు. అనంతరం సాంబమూర్తి మాట్లాడుతూ మండలం లోని సీసాడవలస నుంచి నయా రెబ్బ, వనదార గిరిశిఖర గ్రామాల రహదారి పను లు ప్రారంభించి మధ్యలో వదిలేశారని ఆరోపించారు. వర్షాల పడకముందే పనులు పూర్తిచేసి గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు.