రహదారి కుంగిపోతోంది సారూ..
ABN , Publish Date - May 12 , 2026 | 12:29 AM
నగర పంచాయతీ పరిధిలోని సారిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో రహదా రి కుంగిపోతోందని, వెంటనే బాగుచేయాలని ఆ గ్రామ స్థులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతి
నెల్లిమర్ల, మే 11(ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీ పరిధిలోని సారిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో రహదా రి కుంగిపోతోందని, వెంటనే బాగుచేయాలని ఆ గ్రామ స్థులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. నగర పంచాయతీ పరిధిలోని తొంపలపేట జంక్షన్ నుంచి కుమిలి కాలువ గట్టుపై వెళ్లే తారురోడ్డు ఇప్పటికే పలుచోట్ల కుంగిపో యిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గట్టిగా వర్షా లు కురిస్తే రోడ్డు కాలువలలోకి కొట్టుకుపోయే ప్రమాద ముందన్నారు. అలా జరిగితే బృందావన్ వ్యాలీకాలనీ, జగ్గరాజుపేట, నీలంరాజుపేట, కుదిపి, సారిపల్లి గ్రా మాలకు రాకపోకలు నిలిచిపోతాయని చెప్పారు. అలాగే జంక్షన్ నుంచి బృందావన్ కాలనీ వరకు వీధిలైట్లు లేకపోవడంతో చీకటి పడ్డాక రాకపోకలకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రాత్రివేళల్లో గం జాయి, మద్యం సేవిస్తున్నారని చెప్పారు. అధికారులు స్పందించి శిథిల రహదారిని బాగుచేయాలని, వీధిలైట్లు వేయాలని విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో జేజే పాథక్ తదితరులు ఉన్నారు.