Share News

రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:17 AM

జిల్లాలో రీసర్వే ప్రక్రియను వేగవంతంగా చేసి, డిసెంబరు 15వ తేదిలోగా ఫేజ్‌ 6కు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందన్‌ రెడ్డి ఆదేశించారు.

  రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి

  • కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

  • రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

విజయనగరం, కలెక్టరేట్‌, నవంబరు 27(ఆంధ్రజ్యో తి): జిల్లాలో రీసర్వే ప్రక్రియను వేగవంతంగా చేసి, డిసెంబరు 15వ తేదిలోగా ఫేజ్‌ 6కు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందన్‌ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ సమా వేశ మందిరంలో ఆయన రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 983 గ్రామా లకుగాను ఇప్పటివరకు 755 గ్రామాల్లో రీసర్వే పూర్త యిందని తెలిపారు. జనవరి నుంచి జూలై 2026 వర కూ 522 గ్రామాల్లో 2,22,901 పట్టాదారు పాసు పుస్తకా లు పంపిణీ చేశామని చెప్పారు. ఆగస్టు నుంచి వచ్చే మార్చి వరకూ నిర్దేశించిన ప్రణాళికలో భాగంగా ఇప్ప టివరకూ 233 గ్రామాల్లో 1,75,818 పాసు పుస్తకాలు పంపిణీ చేశామని ఆయన వివరించారు. ఫేజ్‌-6లో 103 గ్రామాలకు సంబంధించి 72,146,11 ఎకరాలు గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తయిందని, వెక్టరైజేషన్‌లో 97,133 పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి గ్రామానికి స్పష్టమైన కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. మ్యుటేషన్‌ దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరిం చాలని ఆయన ఆదేశించారు. పూసపాటిరేగ, జామి, రేగిడి ఆమదాలవలస ప్రాంతాల్లో ల్యాండ్‌ బ్యాంకు భూ ములను గుర్తించి, వాటి వివరాలను సిద్ధం చేయాల న్నారు. జేసీ సేతు మాధవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 12:17 AM