రీసర్వే ప్రక్రియ పక్కాగా నిర్వహించాలి
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:30 AM
రీసర్వే ప్రక్రియను నిబంధన మేరకు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రా మసుందర్‌రెడ్డి తెలిపారు.
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
దత్తిరాజేరు, జూన్ 11(ఆంధ్రజ్యోతి): రీసర్వే ప్రక్రియను నిబంధన మేరకు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రా మసుందర్‌రెడ్డి తెలిపారు. గురు వారం మండలంలోని వంగర గ్రామంలో జరుగు తున్న రీసర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలిం చి అధికారులకు సూచనలు చేశారు. రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాల ను, సమస్యలను తెలుసుకున్నారు. రీసర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వ హించాలని, రైతులకు ఇబ్బందులు తల్తెకుంటడా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే సర్వే జరిగేట ప్పుడు రైతులకు సమాచారం అందించి వారి సమక్షంలో చేపట్టాల న్నారు. అనంతరం మండల కార్యాలయం లో నిర్వహించిన సమీక్ష జరిపారు. కార్య క్రమంలో ఏపీడీ రమామణి, తహసీల్దార్ బి.సురేష్, సూపరింటెండెంట్ శివాజీ, ఏపీవో కామేశ్వరరావు, ఇన్‌చార్జ్ మండల సర్వేయర్ శివ, ఇరిగేషన్ ఏఈ పైడిపునా యుడు తదితరులు పాల్గొన్నారు.
‘ఎంపీలాడ్స్ పనులు పూర్తి చేయాలి’
విజయనగరం కలెక్టరేట్, జూన్ 11(ఆంధ్ర జ్యోతి): జిల్లాలో ఎంపీలాడ్స్‌తో మంజూరైన పనులు త్వరితగతి న పూర్తి చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదే శించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ఎంపీల్యాడ్స్ పనులపై అధికారులతో సమీక్షించారు. 18వ లోకసభ విజయ నగరం పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ నిధులతో 67 పనులు మంజూరు కాగా.. వాటిలో 26 పనులు పూర్తయ్యాయని, 14 పనులు పురోగతి లో ఉన్నాయని, 27 పనులు ప్రారంభం కావల్సి ఉందని తెలిపారు. ప్రా రంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే పనులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఆప్లోడ్ చేయాలన్నారు. అలాగే విశాఖప ట్నం లోక్‌సభ ఎంపీ నుంచి 4 పనులు మంజూరు కాగా 4 పనులు ప్రారంభం కావాల్సి ఉందని, ఈనెలా ఖరు లోపల పనులు ప్రారంభం కావాలని ఆయన ఆదే శించారు. రాజ్యసభ ఎంపీల నుంచి 8 పనులు మంజూ రు కాగా.. 3 పనులు పూర్తయ్యాయని, మిగిలిన వెంట నే ప్రారంభించాలన్నారు. పూర్తయిన పనులను ఆన్‌లైన్ లో ఆప్‌డేట్ చేయాలని, ప్రారంభించడానికి వీలుకాని వాటికి రిమార్క్ రాసి ఆయా పార్లమెంట్ సభ్యులకు పంపాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సీపీవో బాలాజీ, ఈపీడీసీ ఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, ఆర్ అండ్‌బీ పంచాయతీ శాఖల ఇంజనీర్లు పాల్గొన్నారు.