Share News

ఫిబ్రవరి నాటికి రీ సర్వే పూర్తి చేయాలి

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:20 AM

జిల్లాలో వచ్చే ఫిబ్రవరి నాటికి రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు.

ఫిబ్రవరి నాటికి రీ సర్వే పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వచ్చే ఫిబ్రవరి నాటికి రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియను నిర్వ హించి, పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేసినట్ల యితే చాలా వరకూ రీసర్వే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జేసీ సేతుమాధవన్‌ మాట్లాడు తూ సెప్టెంబరు నెలాఖరు నాటికి మొత్తం 50 గ్రామా ల రీసర్వేను పూర్తి చేయాలని, నిర్దేశించిన లక్ష్యాన్ని తప్పకుండా సాధించాలని చెప్పారు. 22ఏ దరఖాస్తుల ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ వన్‌కు సంబంధించిన స్కానింగ్‌ ప్రక్రియలో జిల్లా వెనుకబడి ఉందని, మిగిలిన స్కానింగ్‌ పనులను కూడా త్వరగా పూర్తి చేసి మెరుగైన ర్యాంక్‌ను సాధించే దిశగా కృషి చేయాలన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:20 AM