గజరాజుల బీభత్సం
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:01 AM
మండలంలోని సోమినాయుడువలస గ్రామ పరిధిలో ఏనుగులు గురువారం బీభత్సం సృష్టించాయి.
- టమాటా, అరటి పంటల ధ్వంసం
కొమరాడ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సోమినాయుడువలస గ్రామ పరిధిలో ఏనుగులు గురువారం బీభత్సం సృష్టించాయి. వెంపటాపు ఆదినారాయణ అనే రైతు మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసుకున్న 300 కిలోల టమాటాను, పడాల హరి ప్రసాద్‌కు చెందిన అరటి పంటను ధ్వంసం చేశాయి. పగటి వేళల్లో ఆర్తాం కొండల్లో ఉంటున్న ఏనుగులు సాయంత్రం వేళల్లో పంట పొలాల్లోకి ప్రవేశిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి ఒకే ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.