Share News

Who Will Stop It? ఆగని దందా.. ఆపేదుందా?

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:07 AM

The Racket Continues... Who Will Stop It? మక్కువ మండలం డి.శిర్లాం గ్రామంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ఈ ప్రాంతంలో గోముఖి, సువర్ణముఖి నదులు కలిసే చోట యథేచ్ఛగా తవ్వ కాలు జరిపి ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. అడిగేవారు లేకపోవడంతో ఇసుకా సురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

  Who Will Stop It? ఆగని దందా.. ఆపేదుందా?
డి.శిర్లాం గ్రామం వద్ద ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్న దృశ్యం

  • పార్వతీపురం, రాయగడకు అక్రమంగా తరలింపు

మక్కువ, జూలై 17(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలం డి.శిర్లాం గ్రామంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ఈ ప్రాంతంలో గోముఖి, సువర్ణముఖి నదులు కలిసే చోట యథేచ్ఛగా తవ్వ కాలు జరిపి ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. అడిగేవారు లేకపోవడంతో ఇసుకా సురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుమతుల్లేకుండా తమ దందా కొన సాగిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో అప్పటి తహసీల్దార్‌ కె.భరత్‌కుమార్‌ స్పందించారు. తన సిబ్బందితో డి.శిర్లాం ప్రాంతానికి వెళ్లి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నారు. దీంతో కొద్ది రోజుల పాటు ఇటువైపు కన్నెత్తి చూడని ఇసుకాసురులు మళ్లీ ఇప్పుడు రెచ్చిపోతున్నారు. డి.శిర్లాం నదుల తీరంలో ఇసుక తరలించే పనులకు మళ్లీ స్వీకారం చుట్టారు. డి.శిర్లాంతోపాటు పార్వతీపురం మండలంలో పలు గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు ఇక్కడ తవ్వకాలు జరిపి.. పార్వతీపురంతో పాటు ఒడిశా రాష్ట్రం రాయగడకు ఇసుక తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా శుక్రవారం నది ప్రాం తంలో నాలుగు ఇసుక ట్రాక్టర్లు కనిపించాయి. అయితే పార్వతీపురం మండలంలోని పలుగ్రామాలకు తాగునీటిని అందించే రక్షిత పథకం ట్యాంకుకు సమీపంలోనే తవ్వకాలు జరుపుతున్నారు. దీనివల్ల ఆ పథకానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై మక్కవ తహసీల్దార్‌ భానుమూర్తిని వివరణ కోరగా.. ఆ ప్రాంతాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:07 AM