Share News

క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని నిలుపుదల చేయాలి

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:50 PM

రేషన్‌ బియ్యం బస్తాలపై క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొణదం ఉమాశంకరరావు కోరారు.

క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని నిలుపుదల చేయాలి
ఎస్‌.కోట: తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న రేషన్‌ డీలర్లు

- రేషన్‌ డీలర్ల డిమాండ్‌

శృంగవరపుకోట, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం బస్తాలపై క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొణదం ఉమాశంకరరావు కోరారు. మంగళవారం తహసీల్దార్‌ డి.శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. ఆధునాతన క్యూఆర్‌ స్కానింగ్‌ పరికరాలు డీలర్లకు అందుబాటులోకి తెచ్చిన తరువాత ఆ విధానాన్ని అమలు చేయాలని కోరారు. డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు.

-కొత్తవలస, అక్టోబరు 13 ( ఆంధ్రజ్యోతి): రేషన్‌డీలర్లు సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు రామలింగేశ్వరరావు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందచేశారు. క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరారు. క్వింటాకు రూ.200 చొప్పున కమీషన్‌తో పాటు నిర్వహణా ఖర్చుల కింద నెలకు రూ.5వేలు డీలర్లకు ఇవ్వాలని కోరారు. ఖాళీ గోనె సంచులను అప్పగించాలనే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీలర్లు పాల్గొన్నారు.

-వేపాడ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ మండల డీలర్లు మంగళవారం తహసీల్దార్‌ జె.రాములమ్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం అధ్యక్షుడు వంటాకు కృష్ణ, నాయకులు, డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:50 PM