పైడితల్లి జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:04 AM
రాజాం లో ఈనెల 22 నుంచి 24 వరకూ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే కోండ్రు
రాజాం/ రూరల్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాజాం లో ఈనెల 22 నుంచి 24 వరకూ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దేవదాయశాఖ అమ్మవారి శత వసం తాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిందని, ఈ మేరకు జాతర నిర్వహణకు రూ.50లక్షలు కేటాయించిం చారని ఆయన గుర్తు చేశారు. గురువారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పొలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, ఎండోమెంట్, ఫైర్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతరలో పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, తాత్కాలిక మురగుదొడ్లు ఏర్పాటు, వైద్యశిబిరాల నిర్వహణ తదితర అంశాలపై చేయనున్న ఏర్పాట్లను మున్సిపల్ కమిషన ర్ రామచంద్రరావు వివరించారు. పైడితల్లి దేవస్థానం ఈవో బీవీ మాధవరావు, ఆర్‌అండ్‌బీ ఏఈ నాగభూష ణరావు, ట్రాన్స్‌కో ఏఈ కుమార్, రాజాం ఏరియా ఆసు పత్రి సూపరింటెండెంట్ డా.కరణం హరిబాబు తదితరులు జాతరలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా పొలీసు శాఖ అప్రమత్తం కావాలన్నా రు. వైద్య, అగ్నిమాపక, పారిశుధ్య అధికారులకు వివిధ సూచనలు చేశారు. పైడితల్లి జాతరను రాష్ట్ర పండుగ గా గుర్తించిన నేపథ్యంలో టీడీపీ నాయకుడు దుప్పల పూడి శ్రీనివాసరావుతో పాటు నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలి పారు. అంతకుముందు అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించు కున్నారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.