Share News

ప్రజలను అప్రమత్తం చేయాలి

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:29 AM

తుఫాన్‌ వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా ముందుస్తు చర్యలు ముమ్మరం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు కోరారు. బుధవారం చీపురుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల తలెత్తే సమస్యల పట్ల అధికారులు ప్రజలకు అవ గాహన కల్పించాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ప్రజను అప్రమత్తం చేయాలని కోరారు.

 ప్రజలను అప్రమత్తం చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న రామ్‌మల్లిక్‌నాయుడు :

చీపురుపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా ముందుస్తు చర్యలు ముమ్మరం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు కోరారు. బుధవారం చీపురుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల తలెత్తే సమస్యల పట్ల అధికారులు ప్రజలకు అవ గాహన కల్పించాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ప్రజను అప్రమత్తం చేయాలని కోరారు. అనంతరం, పట్టణానికి చెందిన ఎ.రామారావు కుటుంబానికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ బి.సంతోష్‌, ఎంపీడీవో ఐ. సురేష్‌, డిప్యుటీ ఎంపీడీవో అప్పలనాయుడు, ఏవో ఎస్‌.సూర్యకుమారి, పార్టీ నాయకులు గవిడి నాగరాజు, ఇజరోతు రాంబాబు, చల్లా శ్రీరాం పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:29 AM