Share News

ప్రజా హితమే ప్రభుత్వం ధ్యేయం

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:56 PM

ప్రజాహితమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎస్‌.కోట, మాడుగుల ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు.

 ప్రజా హితమే ప్రభుత్వం ధ్యేయం
వంతెన ప్రారంభిస్తున్న కోళ్ల లలితకుమారి, బండారు సత్యనారాయణమూర్తి :

వేపాడ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాహితమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎస్‌.కోట, మాడుగుల ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. బుధవారం వేపాడ మండలంలోని కృష్ణరాయుడుపేట జంక్షన్‌ వద్ద బల్లంకి-బానాది రోడ్డులో రైవాడ కాలువపై రూ.కోటి 34 లక్షలతో నిర్మించిన వంతెన ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేడీ రోడ్డులో కృష్ణరాయుడుపేట జంక్షన్‌ వద్ద వంతెన ప్రమాదకర పరిస్థితిలో ఉండడం, గత ఏడాది జనవరిలో బల్లంకి బానాది రోడ్డులో వంతెన కూలిపోయిన విషయం లలితకుమారి తాను జీవీఎంసీ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరుచేయాలని కోరినట్లు తెలిపారు లలితకుమారి మాట్లాడుతూ తామిద్దరం చేసిన కృషి వల్ల వంతెనలు పూర్తికావడంతో విశాఖ-విజయనగరం జిల్లాల ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందన్నారు. కార్యక్రమంలో కొప్పలవెలమ సంఘం నాయకుడు పీవీజీ కుమార్‌, కూటమి నాయ కులు రొంగలి మహేష్‌, కిలపరి భాస్కరరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు చీపురుపల్లి రామా రావు, భోజంకి సూర్యనారాయణ, గొంప వెంకటరావు, తులసి, నాగరాజు, వెంకట చిన రామునాయుడు, ఎస్‌.అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 11:56 PM