సమస్యలు పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలి: డీఎస్పీ
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:06 AM
గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పెద్దలు దృష్టికి తీసుకువెళ్లాలని డీఎస్పీ పి.రాఘవులు కోరారు. బుధవారం గుర్ల పోలీసు స్టేషన్‌లో గ్రామ స్థాయిలో పనిచేసే మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు.
గుర్ల, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పెద్దలు దృష్టికి తీసుకువెళ్లాలని డీఎస్పీ పి.రాఘవులు కోరారు. బుధవారం గుర్ల పోలీసు స్టేషన్‌లో గ్రామ స్థాయిలో పనిచేసే మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు పానియాలు సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలతో పాటు జైలు శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీఐ నారాయణరావు, సిబ్బంది పాల్గొన్నారు.