Share News

‘సీహెచ్‌డబ్ల్యూల సమస్యలు పరిష్కరించాలి’

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:34 AM

గిరిజన ప్రాంతంలో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల(సీహెచ్‌డబ్ల్యూ) సమస్యలు పరిష్కరించా లని సీఐటీయూ నాయకులు కె.నాగమణి, సరస్వతి, కాంచన కోరారు. సోమ వారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు, సీహెచ్‌డబ్ల్యూలు నిరసన తెలిపారు.

‘సీహెచ్‌డబ్ల్యూల సమస్యలు పరిష్కరించాలి’
ఏపీవోకు వినతిపత్రం అందజేస్తున్న సీహెచ్‌డబ్ల్యూలు:

సీతంపేట రూరల్‌,మార్చి 16(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల(సీహెచ్‌డబ్ల్యూ) సమస్యలు పరిష్కరించా లని సీఐటీయూ నాయకులు కె.నాగమణి, సరస్వతి, కాంచన కోరారు. సోమ వారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు, సీహెచ్‌డబ్ల్యూలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని ఏపీవో జి.చిన్నబాబుకు అందజేశారు. కార్యక్రమంలో సీహెచ్‌డబ్ల్యూలు ఎస్‌.కాంచన, సరస్వతి, మల్లమ్మ, ఎస్‌.శిరీష, మార్తమ్మ, శాంతి, మాణిక్యం, కుమారి, రాధిక, జయలక్ష్మి, గౌరి పాల్గొన్నారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 25వినతులు

సీతంపేట ఐటీడీఏకార్యాలయంలో ఏపీవో జి.చిన్నబాబు ఆధ్వర్యంలో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గిరిజనుల నుండి 25వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో పీహెచ్‌వో ఎస్‌వీ గణేష్‌, ఏవో వావాణి, డిప్యూటీ ఈవో నారాయడు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 12:34 AM