కూటమి ధర్మాన్ని పాటించాలి
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:16 AM
నగర పంచాయతీ ఎన్నికల్లో చైర్పర్సన్ అభ్యర్థి ఎవరైనా కూటమి ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరూ సీటు ఖరారు చేసిన వారికి వెన్నంటే ఉండి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పాల కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు.
ఫపాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
పాలకొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీ ఎన్నికల్లో చైర్పర్సన్ అభ్యర్థి ఎవరైనా కూటమి ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరూ సీటు ఖరారు చేసిన వారికి వెన్నంటే ఉండి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పాల కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. శుక్రవారం పాలకొండలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈసందర్భంగా మాట్లాడు తూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు చైర్పర్సన్ అభ్యర్థిని ఖరారు చేస్తామని, అందరూ కలిసికట్టుగా గెలుపే లక్ష్యంగా పనిచే యాలని కోరారు. కౌన్సిలర్ సీట్ల సర్దుబాటుపై ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి పడాల భూదేవి, జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, బీజేపీ, ఇతర నాయ కులంతా సమీక్షించారు. 28 వార్డులకుగాను టీడీపీ, జనసేనకు 13 చొప్పున, బీజేపీకి రెండు సీట్లు ఖరారుచేసినట్లు జయకృష్ణ, భూదేవి తెలిపారు. చైర్ పర్సన్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ హైకమాండ్ ఆధ్వర్యంలో ఖరారు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ అభ్యర్థిత్వంపై ఆశావహులతో చర్చించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పల్లా కొండలరావు, గంటా సంతోష్కుమార్, గుమ్మిడి సింహాద్రి, సి.ఎల్.నాయుడు, వెన్నపు శ్రీను, కొండదాడి రాజేష్ పాల్గొన్నారు.