The Presidential orders must be stayed. రాష్ట్రపతి ఉత్తర్వులను నిలిపేయాలి
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:50 PM
The Presidential orders must be stayed. ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతులపై ప్రభుత్వం సమీక్షించాలని, రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను నిలిపేయాలి
గత ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి తూట్లు పొడిచింది
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతాం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ
విజయనగరం కంటోన్మెంట్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతులపై ప్రభుత్వం సమీక్షించాలని, రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక యూత్ హాస్టల్‌లో జరిగిన జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం 12మంది ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి అధ్యయనం చేశామని చెప్పిందని, 2022లో జీవో ఇచ్చినట్లు నేటివరకూ ఏ ఉద్యోగికీ తెలియదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనిపై ప్రత్యేక దృష్టిసారించి తమకు న్యాయం చెయ్యాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై అక్టోబరు 12న మేల్కొనండి మాట్లాడండి అనే కార్యక్రమం చేపడతామన్నారు. ఉత్తరాంధ్రలో 4 రోజులు చర్చావేదిక నిర్వహించనున్నామన్నారు. స్థానికతను ఆధారంగా చేసుకుని రిజర్వేషన్ కల్పిస్తున్నప్పుడు సినియార్టీ ప్రకారం ఉద్యోగులను కేటాయించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, సంఘం జిల్లా కార్యదర్శి బాలబాస్కరరావు, గౌరవ అధ్యక్షుడు ఎంపీ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.