సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:13 AM
ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం రూరల్, సెప్టెంబరు 27 (ఆంధ్ర జ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాల యంలో నియోజకవర్గస్థాయి ప్రజా దర్బార్ నిర్వహిం చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి శుక్రవారం గజప తినగరం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహి స్తున్నామని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవా లన్నారు. ప్రజలిచ్చిన వినతులపై సంబంధిత అధికా రితో మాట్లాడి, సమస్య పరిష్కారం ఏ దశలో వుందో కూడా తెలుసుకుంటామన్నారు. ఆ వివరాలను ఆన్‌లై న్ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయ కులు కొండపల్లి భాస్కరనాయుడు, మక్కువ శ్రీధర్, నంబూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.