Share News

వారి భవిష్యత్తు ప్రజలే నిర్ణయించాలి

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:17 AM

గొడ్డలి పార్టీ మనుగడ పై రాష్ట్ర ప్రజలు, మేథావులు ఆలోచన చేయాలని, కులాలు, మతాల పేరుతో గొడవలు సృష్టిస్తున్న పార్టీలు, నాయకుల భవిష్యత్తును ప్రజలే నిర్ణయిం చాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కోరారు.

వారి భవిష్యత్తు ప్రజలే నిర్ణయించాలి

  • వైసీపీ నేతలపై ఎమ్మెల్యే కళా వెంకటరావు విమర్శలు

చీపురుపల్లి, జూలై 11(ఆంధ్ర జ్యోతి): గొడ్డలి పార్టీ మనుగడ పై రాష్ట్ర ప్రజలు, మేథావులు ఆలోచన చేయాలని, కులాలు, మతాల పేరుతో గొడవలు సృష్టిస్తున్న పార్టీలు, నాయకుల భవిష్యత్తును ప్రజలే నిర్ణయిం చాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కోరారు. చీపురు పల్లిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. 11 సీట్లు ఇచ్చారన్న కోపంతో వారు ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నారు. పీఠం కోసం ఎంతకైనా తెగించి, ఏదో ఒకటి చేసి, తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న గొడ్డలి పార్టీ నాయకులు.. రావణ్‌ వంటి వారిని ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. గతంలో మూడు రాజధానులు కావాలన్నా నాయకుడు, ఇప్పుడు మావిగన్‌ అంటున్నారన్నారు. సర్‌ ప్రక్రియ పట్ల బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనంత రం ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

స్టేడియం నిర్మాణం పూర్తి చేయండి..

చీపురుపల్లి పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ఇండోర్‌ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయాలని పట్టణానికి చెందిన యువత, విద్యార్థులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. జి.అగ్రహారానికి చెందిన ఉపాధ్యాయుడు డోల నాగరాజు ఆధ్వర్యంలో వీరు శనివా రం ప్రజాదర్బార్‌లో వినతిపత్రం సమర్పించారు. శాప్‌ నుంచి నిధులు విడుదల చేయించి, నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రైతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, ముల్లు రమణ, కోట్ల మోతీలాల్‌నాయుడు, వెన్నె సన్యాసినాయుడు, పైల బలరాం, సారేపాక సురేష్‌, బీజేపీ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:17 AM