ఐక్యతతోనే పార్టీ బలోపేతం
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:01 AM
ఐక్యతతో నాయకులు, కార్యకర్తలు మెలిగిన నాడే పార్టీ బలోపేతం అవుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు.
పాచిపెంట, జనవరి22 (ఆంధ్రజ్యోతి): ఐక్యతతో నాయకులు, కార్యకర్తలు మెలిగిన నాడే పార్టీ బలోపేతం అవుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. గురువారం పి.కోనవలసలో టీడీపీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశా నికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా కృషి చేయడం వల్లే తాను ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయికి ఎదిగానన్నారు. ఇకపై కూడా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. సీనియర్ నాయకుల సూచనలు, సలహాలు తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. మండలంలో గల ప్రతీ నాయకుడిని పలకరిస్తూ ఆయా పంచాయతీ, గ్రామాల్లో సమస్యలు అడిగి స్వయంగా తెలుసుకోవాలన్నారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు గూడేపు యుగంధర్, సాలూరు ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, నాయకులు మతల బలరాం, పూసర్ల నరసింగరావు, పల్లేడ వెంకటరమణ, చల్లా కనకబాబు పాల్గొన్నారు.