పార్టీని బలోపేతం చేయాలి: కోండ్రు
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:20 AM
గ్రామ స్థాయి లో పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు.
రాజాం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయి లో పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్, కార్యక ర్తే అధినేత కార్యక్రమం నిర్వహించారు. ఈసం ద ర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో 325 వినతులు వస్తే 277 వినతులు పరిష్కరించామని చెప్పారు. నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి స హాయ నిధి చెక్కులను 235 మంజూరు చేశామ న్నారు. మొత్తం రూ.2కోట్లు చెక్కులు అందజేసినట్టు తెలిపారు. గురువారం 17మంది లబ్ధిదారులకు రూ.5ల క్షల 95వేలు విలువగల చెక్కులను అందజేశా రు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థు లకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. టీడీపీ పట్టణ అధ్య క్షుడు నంది సూర్యప్రకాషరావు, గురవాన నారాయణ రావు, వల్లూరు గణేష్, దూబ ధర్మారావు పాల్గొన్నారు.