Share News

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కావాలి

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:58 PM

గ్రామ స్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కావాలి
లీడర్‌ టు క్యాడర్‌ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలో సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి లీడర్‌ టు క్యాడర్‌ యాప్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను ఆ మె ప్రదర్శించారు. అనంతరం ఆమె స్థానిక విలే కరులతో మాట్లాడుతూ రాష్ట్రం నుంచి బూత్‌ స్థాయి వరకు ప్రతీ సమాచారాన్ని సమర్థంగా చేరవేయాలన్నారు. గ్రామ, వార్డు, మండల స్థా యిలో 10 మందితో కమిటీలు, నియోజకవర్గ స్థాయిలో 10 మందితో కమిటీ, జిల్లా స్థాయిలో 17 అనుబంధ కమిటీలు ఉంటాయన్నారు. లీడర్‌ నుంచి క్యాడర్‌ వరకు పార్టీ నిర్ణయాలు, కార్యక్రమాలు స్పష్టంగా తెలియజేయాల్సి ఉం టుందన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామ, వార్డు, బూత్‌ స్థాయిలో పార్టీ బలపరచడం ప్రధాన బాధ్యత అన్నారు. ప్రతీ బూత్‌లో పార్టీ బలాన్ని పెంచేందుకు కార్యాచరణ మొదలుపెట్టాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుప తిరావు, గుళ్ల వేణుగోపాల నా యుడు, గూడెపు యుగంధర్‌, ఆమదాల పరమేశ్‌, కిలారి రవికుమార్‌, బృందావనం అశోక్‌, అక్కిన రాధ, కల్యాణితో పాటు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 11:58 PM