సమష్టి కృషితో పార్టీని బలోపేతం చేయాలి
ABN , Publish Date - May 02 , 2026 | 12:11 AM
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమష్టి కృషితో టీడీపీని బలోపేతం చేసే విధంగా నడుచుకోవాలని పార్టీ పొలి ట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి
గజపతినగరం, మే 1(ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమష్టి కృషితో టీడీపీని బలోపేతం చేసే విధంగా నడుచుకోవాలని పార్టీ పొలి ట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు. పొలి ట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులైన ఆమెను శుక్ర వారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సర్దుకుపోవాలని సూచిం చారు. తనపై ఎంతో నమ్మకంతో పార్టీ బాధ్యతను అప్పగించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీ స్సులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచనలు, సల హాలతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, టీడీపీ దత్తిరాజేరు మండల అధ్యక్షుడు చప్పా చంద్రశే ఖర్, బొండపల్లి మండల అధ్యక్షుడు రాపాక అచ్చుం నాయుడు, గంట్యాడ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు లెంక బంగా రునాయుడు తదితరులు పాల్గొన్నారు.