Share News

పుట్టు దేవుడి పాత విగ్రహాన్ని

ABN , Publish Date - May 03 , 2026 | 12:08 AM

తోటపల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పురాతన పుట్టు దేవుడి పాత విగ్రహాన్ని గర్భ గుడిలోనే ప్రతిష్ఠించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

పుట్టు దేవుడి పాత విగ్రహాన్ని
రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు, భక్తులు

గర్భగుడిలోనే ప్రతిష్ఠించాలి

- రోడ్డు పక్కన పెట్టడం విచారకరం

- బీజేపీ నాయకులు, భక్తుల నిరసన

గరుగుబిల్లి, మే 2 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పురాతన పుట్టు దేవుడి పాత విగ్రహాన్ని గర్భ గుడిలోనే ప్రతిష్ఠించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శనివారం దేవస్థానం ఆవరణలో బీజేపీ నాయ కులు, భక్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ.. గత ఐదు దశాబ్దాలుగా పరిసర ప్రాంతాల భక్తులతో పూజలు అందుకుంటున్న పుట్టు దేవుడి విగ్రహాన్ని నడి రోడ్డుపై ఏర్పాటు చేయడం విచారకరమన్నారు. గతేడాది ప్రారంభించిన నూతన ఆలయంలో పుట్టు దేవుడి పాత విగ్రహాన్ని కాకుండా వేరే విగ్రహాన్ని గర్భ గుడిలో ప్రతిష్ఠించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నా రు. పాత విగ్రహాన్ని గర్భ గుడిలో ప్రతిష్ఠించేంత వరకూ పోరాటం కొనసాగుతుందన్నా రు. ఈవో దేవస్థానంలో లేరని, దిగువ స్థాయి సిబ్బందితోనే పాలన కొనసాగించడం అవమా నకరమన్నారు. దేవదాయశాఖ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి విడనా డాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, స్వామివారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 12:08 AM