Share News

The Numbers Are Clear తేలిన లెక్క

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:25 AM

The Numbers Are Clear పురపోరులో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. పార్వతీపురం మున్సిపాల్టీలో చైర్‌పర్సన్‌ రేసులో నలుగురు ఉన్నారు.

The Numbers Are Clear తేలిన లెక్క
పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం

  • పార్వతీపురంలో చైర్‌పర్సన్‌లో రేసులో నలుగురు

  • సాలూరులో ఆరుగురు, పాలకొండలో ముగ్గురు పోటీ

  • బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు

పార్వతీపురం టౌన్‌/సాలూరు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పురపోరులో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. పార్వతీపురం మున్సిపాల్టీలో చైర్‌పర్సన్‌ రేసులో నలుగురు ఉన్నారు. కౌన్సిలర్‌ అభ్యర్థులుగా 122 మంది బరిలో ఉన్నారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా టీడీపీ నుంచి బెలగాం కరుణ, వైసీపీ నుంచి పి.సాయిశ్రీ, కాంగ్రెస్‌ నుంచి పాలకొండ సంధ్య, ఇండిపెండెంట్‌గా పూసర్ల లలిత పోటీలో ఉన్నారు. 36 వార్డుల నుంచి కౌన్సిలర్‌ అభ్యర్థులుగా 210 మంది బరిలో ఉన్నారు. వారిలో టీడీపీ 32, వైసీపీ 36, జేఎస్పీ 12, బీజేపీ 1, సీపీఐ(ఎం) 4, సీపీఐ 1, ఐఎన్‌సీ 2, ఇండిపెండెంట్లు 36 మంది ఉన్నారు.

- సాలూరు మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 85 మంది వివిధ పార్టీల నుంచి కౌన్సిలర్‌ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. చైర్‌పర్సన్‌ పదవికి గాను ఆరుగురు పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా గుళ్ల మంజీరా, లచ్చుబత్తుల కల్పన, నిమ్మాది శ్యామల, జనసేన నుంచి గొర్లె విజయకుమారి, వైసీపీ నుంచి రిబ్కారాణి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి సిగడాపు ధనలక్ష్మి బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు కోరిన గుర్తులు కేటాయించామని, బ్యాలెట్లు కూడా కేటాయించి నట్టు కమిషనర్‌ శంకరరావు తెలిపారు. వచ్చేనెల 1న పోలింగ్‌ జరగ్గా 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాల విడుదల ఉంటుందని చెప్పారు.

- పాలకొండ నగర పంచాయతీలో చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా జనసేన నుంచి పల్లా విజయనిర్మల , వైసీపీ నుంచి పాలవలస ఇందుమతి, స్వతంత్య్ర అభ్యర్థిగా భాసూరు శ్రీదేవి పోటీ చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడ ముగ్గురు ఆ రేసులో ఉన్నారు. 28 వార్డుల్లో 63 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి 13, జనసేన 13, వైసీపీ 27, సీపీఎం1, బీజేపీ 2, స్వతంత్రులు ఏడుగురు పోటీలో ఉన్నారు. 19 వార్డులో జనసేన నుంచి ఒకటే నామినేషన్‌ ఉండడంతో ఏకగ్రీవం కానున్నట్లు తెలిసింది.

- పట్టణాల్లో ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించారు. 21న నామినేషన్ల ఉపసంహరణ కూడా సాఫీగా పూర్తయింది. అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటనను తాత్కా లికంగా వాయిదా వేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాజాగా బరిలో నిలిచే వారి పేర్లు ప్రకటించారు.

Updated Date - Oct 26 , 2026 | 12:25 AM