‘వేతనదారుల సంఖ్య పెంచాల్సిందే..’
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:03 AM
ఉపాధి హామీ వేతనదారుల సంఖ్య పెంచకుంటే చర్యలు తప్పవని పార్వతీపురం క్లస్టర్ ఉపాధి హామీ పథకం ఏపీడీ పి.త్రివిక్రమరావు హెచ్చరించారు.
గరుగుబిల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ వేతనదారుల సంఖ్య పెంచకుంటే చర్యలు తప్పవని పార్వతీపురం క్లస్టర్ ఉపాధి హామీ పథకం ఏపీడీ పి.త్రివిక్రమరావు హెచ్చరించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీజీ రామ్‌జీ పథకంలో పలు రకాల పనులు వేతనదారులతో నిర్వహించాలని క్షేత్ర సహాయకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రోజువారీ 2 వేలకు పైగా వేతనదారులకు పనులు కల్పించాలని ఆదేశించినా అతి తక్కువ మంది హాజరవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు కారణంగా తక్కువ స్థాయిలో హాజరవుతున్నారని క్షేత్ర సహాయకులు వివరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్థాయిలో విచారణ నిర్వహించి నివేదికలు అందించాలని టెక్నికల్ అసిస్టెంట్లు ఆదేశించారు. నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోకుంటే వేటు తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీవో ఎన్.సూర్యనారాయణ, ఏపీవో ఈశ్వరమ్మ, జేఈ డి.తేజేశ్వరరావు పాల్గొన్నారు.
1111111111111111111
‘రైతు ప్రయోజనాల కోసమే ‘గట్టుమీద చెట్టు’
జియ్యమ్మవలస, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి): రైతు ప్రయోజనాల కోసమే గట్టు మీద చెట్టు కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. బుధవారం సుభద్రమ్మవలస సమీపంలో నిర్వహించిన గట్టు మీద చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి.. పాలకొండ డివిజన్ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌తో కలిసి సుభద్రమ్మవలస సమీపంలో మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గట్టు మీద చెట్టు వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుం దన్నారు. ప్రతీ రైతు తమ పొలం గట్లుపై ఉసిరి, నిమ్మ, కొబ్బరి, టేకు, మునగ, మామిడి వంటి మొక్కలు నాటి వాటిని సంరక్షించా లన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధకశాఖ జేడీ డాక్టర్ సీహెచ్. దీనకుమార్, జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్, కురుపాం ఏడీఏ అన్నపూర్ణమ్మ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల వ్యవసాయాధికారులు, ఉద్యానవనశాఖ అధికారులు పాల్గొన్నారు.
మొక్క నాటుతున్న కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి222222