Share News

పోలీసు కానిస్టేబుల్‌ పోస్టులు పెంచాలి

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:49 AM

పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు.

పోలీసు కానిస్టేబుల్‌ పోస్టులు పెంచాలి
ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు

  • కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన నిరుద్యోగులు

విజయనగరం, కలెక్టరేట్‌ ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. వారు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. వాళ్లు బైఠాయించడంతో విజయనగరం నుంచి పార్వతీపురానికి వెళ్లే రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు వారు ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ 10వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు.

Updated Date - Sep 01 , 2026 | 12:49 AM