Share News

The National Lok Adalat must be made a success. జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:10 AM

The National Lok Adalat must be made a success. జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా న్యాయాధికారి ఎం.బబిత సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. న్యాయవాదులతో పాటు బ్యాంకులు, బీమా సంస్థలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌, మున్సిపల్‌ తదితర శాఖలు సహకరించాలన్నారు.

The National Lok Adalat must be made a success. జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలి

జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలి

అన్ని శాఖల సమన్వయం అవసరం

జిల్లా న్యాయాధికారి బబిత

విజయనగరం దాసన్నపేట, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి):

జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా న్యాయాధికారి ఎం.బబిత సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. న్యాయవాదులతో పాటు బ్యాంకులు, బీమా సంస్థలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌, మున్సిపల్‌ తదితర శాఖలు సహకరించాలన్నారు. రాజీ ద్వారా పరిష్కరించగలిగే క్రిమినల్‌ కాంపౌండబుల్‌ కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, కుటుంబ, భూ వివాదాలు, కార్మిక సంబంధిత వివాదాలు, విద్యుత్‌ బిల్లులు, రెవెన్యూ, సివిల్‌ కేసులను గుర్తించి లోక్‌అదాలత్‌కు పంపించాలన్నారు. సెప్టెంబరు 12న జాతీయ లోక్‌అదాలత్‌ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని అన్ని న్యాయస్థానాలు, మండల న్యాయసేవా కమిటీలు, సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికే ప్రీ లిటిగేషన్‌ కేసులను గుర్తించి రాజీ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇకనుంచి ప్రతివారం సంబంధిత శాఖల అధికారులు లోక్‌అదాలత్‌కు రిఫర్‌ చేసిన కేసులకు సంబంధించి జారీ చేసిన నోటీసులు, కేసుల వివరాలను జిల్లా న్యాయసేవా సంస్థకు నిర్దేశిత నమునాలో పంపాలన్నారు.

-------------------

Updated Date - Aug 06 , 2026 | 12:10 AM